ఎన్టీఆర్ బయోపిక్: పురందరేశ్వరి పాత్రలో ఆమెనే…

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రంకు సంభందించిన ఫొటోలు చాలా స్ట్రాటజీగా విడుదల చేస్తూ క్రేజ్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి పాత్ర గురించిన ఇన్ఫో బయిటకు వచ్చింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమాలో పురంధరేశ్వరి పాత్ర కోసం ఒక అచ్చతెలుగు అమ్మాయిని ఎంపిక చేసి షూటింగ్ చేస్తున్నారు …ఆమె మరెవరో కాదు కాట్రగడ్డ హిమాన్సీ చౌదరి. అదేంటి.. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పాత్రకి ఎంపిక కాబడిన ఈ అమ్మాయి ఎవరా అని ఆలోచనలో పడకండి.

విజయవాడకు చెందిన  హిమాన్సీ చౌదరి    క్లాసికల్ డాన్సర్. ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే  కాక జాతీయ స్థాయిలో చాలా పేరు ఉంది. ఇప్పటికే కొన్ని వందల నృత్య ప్రదర్శనలు ఇవ్వటమే కాక పలు రాష్ట్రాల గవర్నర్ల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా ఈ అమ్మాయి పోలికలు పురంధరేశ్వరికి దగ్గరగా ఉండటంతో క్రిష్ ఆ పాత్రకి హిమాన్సీని ఖాయం చేసారు అని తెలుస్తుంది . ఈ సినిమాలో ఈ పాత్ర నిడివి సుమారు 20 నిమిషాలు ఉంటుంది అని సమాచారం

ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న చిత్రాల పట్ల మీ స్పందన ఏంటని పురందరేశ్వరిని ప్రశ్నించగా “నాన్న గారి జీవితం తెరిచిన పుస్తకం, ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితాలు ప్రజలందరికీ తెలుసు. ఆయన జీవితంపై బయోపిక్ తియ్యాల్సిన అవసరం లేదు” అని   అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.