‘సాహో’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది, దుమ్ము దులిపేసింది

మే 21న అంటే ఈ రోజున ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేస్తే ఏ రేంజిలో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రభాస్ చెప్పటంతో ఫ్యాన్స్ అంతా కళ్లు కాయిలు కాసేలా ఎదురుచూసారు. మీడియా అయితే ఆ సర్పైజ్ ఏమిటి అంటూ రకరకాల స్పెక్యులేషన్స్ చేసింది. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ అదిరిపోయే సర్పైజ్ వచ్చేసింది. అదేమిటో మీరు ఇక్కడ చూడండి.

సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.

రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.