హాట్ టాపిక్ గా చిరు విషయంలో పవన్ బాగా హర్ట్ అయ్యిన కీలక అంశం.!

chiru pawan kalyan

ఇప్పుడు అయితే ఏపీలో రాజకీయాలు సినిమాలు వేరు వేరు కాదు ఒకటే అన్నట్టుగా ఉన్న సంగతి అంతా గమనిస్తున్నారు. రాజకీయాల్లో సినీ ప్రముఖులు కూడా ఉండడం ప్రత్యక్షముగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దూకుడుగా కనిపిస్తుండడం పరిస్థితులను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.

ఇక ఏపీ ప్రభుత్వం కూడా టాలీవుడ్ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయాలు మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజాన్ని సైతం టాలీవుడ్ తరపున ఎన్నో సార్లు అడిగించుకునేలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రచ్చ అంతా పవన్ సినిమా నుంచే స్టార్ట్ అయ్యింది అని అందరికీ తెలుసు.

కానీ టాలీవుడ్ తరపున అయితే చిరు నే స్వయంగా టాలీవుడ్ కొందరు హీరోలను తీసుకెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో మాట్లాడ్డం జరిగింది. అయితే ఈ అంశాన్ని నిన్న పవన్ ప్రస్తావించడం చాలా హాట్ టాపిక్ గా మారుతుంది.

తన అన్నయ్య చిరంజీవి లాంటి వ్యక్తం నమస్కారం పెడితే తిరిగి నమస్కారం కూడా ఏపీ ముఖ్యమంత్రి పెట్టలేదని అలాంటి పెద్ద వ్యక్తులనే అలా ట్రీట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అని పవన్ తన అన్నయ్య విషయంలో పడ్డ బాధని వెళ్లగక్కుకున్నాడు. దీనితో ఈ మాటలు పవన్ అభిమానుల్లో సహా మెగా ఫ్యాన్స్ లో చర్చనీయాంశం మారుతుంది.