న‌య‌న‌తార‌… క్లూ ఇవ్వ‌ట్లేదుగా!

                                                                   (ధ్యాన్)

సోష‌ల్ మీడియా… చుట్టూ ఉన్న వారిని చ‌టుక్కున చేరుకునే మాధ్య‌మం. సూప‌ర్ స్టార్ మ‌హేష్ నుంచి ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో ఉంటారు. ఎప్పుడూ కాక‌పోయినా అప్పుడ‌ప్పుడైనా త‌మ‌కు సంబంధించిన ముచ్చ‌ట్ల‌ను న‌లుగురితో పంచుకుంటూ ఉంటారు. అయితే అలా న‌లుగురితో పంచుకోవ‌డం న‌య‌న‌తార‌కు న‌చ్చ‌ద‌ట‌. అంతే కాదు.. తింటున్నాన‌ని, వండుతున్నాన‌ని, ఫ‌లానా చోటుకి వెళ్తున్నాన‌ని పోస్ట్ చేయ‌డం అంటే న‌య‌న్‌కు చిరాకు. పైగా సెల్పీలు తీసుకోవ‌డానికి దూరంగా ఉంటుంది. తెలియాల్సిన విష‌యాలు ఎలాగూ తెలుస్తాయి… కానీ సోష‌ల్ మీడియాలో ఉండ‌టం వ‌ల్ల తెలియ‌కూడ‌ని విష‌యాలు కూడా తెలుస్తుంటాయి. ఏ డ్ర‌స్ వేసుకున్నది? ఏ గెట‌ప్‌లో ఉన్న‌ది? ఏ లొకేష‌న్‌లో ఉన్న‌ది… ఫొటోలు  చూసి చాలా మంది క‌నిపెట్టేస్తుంటారు. దీనివ‌ల్ల సినిమాల‌కు సంబంధించిన సీక్రెట్‌లు అన‌వ‌స‌రంగా బ‌యట‌కు వెళ్తాయి. నిర్మాత‌లు ఎన్నో కోట్లు పెట్టి తీసే సినిమాల విష‌యాల‌ను స‌ర‌దాల కోసం లీక్ చేయ‌కూడ‌దు… అన్న‌ది న‌య‌న్ పాటించే కాన్సెప్ట్. నిర్మాత‌ల దృష్టితో ఆలోచిస్తే సూప‌ర్ అనిపిస్తుంది. పాపం అభిమానుల‌కే పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు.