ఎస్సీ అమ్మాయిని చేసుకో..మంచు మనోజ్ కు కౌంటర్

ప్రణయ్ హత్యోదంతంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తీవ్ర స్దాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఆ హత్యను మనోజ్   ఖండిస్తూ ….ఓ ఎమోషనల్ లెటర్ ను తన ట్వీట్ చేశాడు. ఏ రంగంలోనైనా కులాన్ని సమర్థించే వారంతా ప్రణయ్ వంటి హత్యోదంతాలకు బాధ్యత వహించాలని మనోజ్ అన్నాడు. మనమంతా ఒకే సమాజంలో జీవిస్తున్నపుడు కులం పేరుతో ఈ వివక్ష ఎందుని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయమై ఓ నెటిజన్ ..మంచు మనోజ్  కౌంటర్ ఇచ్చారు.

నువ్వు ..రెడ్డి కులస్థురాలిని ఎందుకు వివాహం చేసుకున్నావంటూ మంచు మనోజ్ ని ప్రశ్నించాడు. ‘ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఉంటే.. అప్పుడు నీ తండ్రి రియాక్షన్ ఏంటో తెలిసేది’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఇకపై అలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వొద్దంటూ సూచించాడు. ఇలాంటివి ప్రాక్టికల్‌గా పనికి రావని… ఎందుకంటే ఇది భారతదేశం.. మరో వందేళ్లైనా ఈ దేశంలో కులం, మతం అలాగే ఉంటాయంటూ మాట్లాడాడు.

దీనికి మంచు మనజో స్పందిస్తూ…ఘాటైన రిప్లై ఇచ్చాడు మనోజ్. ‘ఎస్సీ అమ్మాయేంటి? నీకోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టం వరుణ్ ఎస్పీ గారు. నీ నంబర్ చెప్పు నాదైన భాషలో మాట్లాడతా… మగాళ్లలా మాట్లాడుకుందాం. మీ ఆలోచనలకు జోహార్లు’ అంటూట్వీట్ చేశాడు.