ర‌జ‌నీకాంత్ రోబోగా ఎలా మారాడంటే… (వీడియో)

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కోటి బయటికొస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రజనీకాంత్ …రోబో గా ఎలా మారారో మేకింగ్ వీడియోని వదిలారు. అరవై ఏడేళ్ల ర‌జ‌నీకాంత్ వివిధ గెటప్స్ కూడా ఈ వీడియోలో చూపించారు. తాత వ‌య‌స్సులో త‌లైవా త‌న‌ ఎన‌ర్జీ లెవ‌ల్స్‌తో అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

Making of Rajinikanth's look in 2.0 | S. Shankar | Akshay Kumar

అక్కీ అనే విలన్ పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ అద‌ర‌గొట్టనుండ‌గా, ర‌జ‌నీకాంత్ శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌నున్నారు. సుమారు రూ.550 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం బాహుబ‌లి రికార్డులని తిర‌గరాయ‌డం ఖాయం అంటున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘2.0’లో ఇంతకంటే మరెన్నో విశేషాలు ఉన్నాయని చెప్తున్నారు. సైంటిస్ట్‌ వశీకరణ్‌, రోబో చిట్టి పాత్రలే కాకుండా మరో మూడు పాత్రల్లో రజనీ నటిస్తుండగా, రావణుడి తరహాలోనే అక్షయ్‌ కుమార్‌ ఏకంగా 10 పాత్రల్లో కనిపి స్తారని చెప్పుకుంటున్నారు.

టెక్నాలజీపరంగా చూస్తూ 2డి, 3డి, ఐమాక్స్‌ 3డి, ఐమాక్స్‌ రియల్‌ 3డి ఫార్మాట్లలో డాల్బీ అట్మాస్‌ కంటే ఉత్తమమైన సౌండ్‌ టెక్నాలజీతో ‘2.0’ను తీర్చి దిద్దుతున్నారు  శంకర్‌.2.0 నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.