కర్ణాటకలో వీరమహాదేవి చిత్రం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని కన్నడ యువకులు హెచ్చరిస్తున్నారు . సన్నీ పేరు చెబితే చాలు యువకులు మండి పడుతున్నారు . సన్నీ ఇప్పుడు భారతీయ సినిమాల్లో నటిస్తున్నా , ఇంతకూ ముందు ఆమె నగ్న చిత్రాల్లో నటించింది . దానికీ సన్నీ చిత్రాన్ని ఆడనివ్వబోమని కన్నడ ప్రజలు చెప్పటానికి సంబంధం ఏమిటి ఏమిటి ? అనే సందేహం చాలా మందికి రావచ్చు .
కన్నడ ప్రజలలకు సంస్కృతీ , సంప్రదాయం అంటే చాలా గౌరవం . కన్నడ సంప్రదాయాన్ని గౌరవించని వారి పని పడతారు . అలాగే వారి చరిత్ర పై అపారమైన నమ్మకం . చారిత్రిక పురుషులంటే వారికి చాలా గౌరవం . అక్క మహాదేవి కర్ణాటకలో పేరున్న కవయిత్రి . ఆమె 1130 ,1160 మధ్య జీవించింది . ఈమె లింగాయత్ మతానికి చెందింది . కర్ణాటకలో మహాదేవిని ఆరాధిస్తారు . అలాంటి ఆరాద్యురాలైన మహాదేవి పాత్రను ఈమె ధరించడం ఏమిటి అని గొడవ చేస్తున్నారు . ఇది 100 కోట్ల ప్రాజెక్ట్ .
“వీర మహాదేవి ” పేరుతో కన్నడ, తమిళ, తెలుగు, మళయాలం, హిందీ భాషల్లో ఈచిత్రం భారీ బడ్జెట్ తో వి. సి. వాడిఉడైయాన్ దర్శకతంలో నిర్మిస్తున్నారు . ఈరోజు ఉదయం నుంచే కన్నడ రక్షణ వేదిక యువ సేన బెంగళూరు వీధుల్లో రాలీ తీశారు . సన్నీబొమ్మలను తగుల బెట్టారు . ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ ల దగ్గర గొడవ చెయ్యాలని పధకం రచించారు . టికెట్ లను కొని థియేటర్ లోపల కూడా హంగామా సృష్టించాలని ప్లాన్ చేశారు . ఆ సినిమాను ఎలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఆడనివ్వబోమని చెబుతున్నారు.
ప్రస్తుతం “వీర మహాదేవి ” సినిమా విషయమై బెంగళూరులో టెన్షన్ నెలకొని వుంది . ఎలాంటి అవాంఛనీయ సంగటనలు జరక్కుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు .