కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆత్మీయ ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా కలుసుకున్న రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో సిద్దరామయ్య రామ్ చరణ్ ను ఆత్మీయంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పెద్ది సినిమా గురించి కొన్ని విశేషాలను రామ్ చరణ్ సిద్ధరామయ్యకు తెలిపారు. అలాగే సినీ అంశాలు కూడా కొన్ని వీరి మధ్య చర్చకు వచ్చాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఒక భారీ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు మేకర్స్. పెద్ది సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.

Congress Tulasi Reddy EXPOSED Pawan Kalyan's Real Talent | Visakha Steel Plant | Telugu Rajyam