ఆ సినిమా చేయొద్దన్నా వినలేదు.. జేడీ చక్రవర్తి కామెంట్స్

Jd Chakrabarthy ABout Refusing His Mother Suggestion

జేడీ చక్రవర్తి సినిమాలు, ఆయన ఎంచుకునే పాత్రలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి జేడీ చక్రవర్తి తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తన కొత్త చిత్రం ఎంఎంఓఎఫ్ ట్రైలర్ విడుదల సందర్భంగా జేడీ చక్రవర్తి కొన్ని విషయాలను పంచుకున్నాడు. తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించాడు. ఈక్రమంలో తన తల్లి గురించి మాట్లాడాడు.

Jd Chakrabarthy ABout Refusing His Mother Suggestion
Jd Chakrabarthy ABout Refusing His Mother Suggestion

వ్యక్తిగత జీవితంలో అమ్మ చెప్పిందే వింటా. ఆవిడ సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేయను. పెళ్లి కూడా అమ్మ చెప్పిందనే చేసుకున్నారా అని అడగబోతున్నారు కదా (నవ్వుతూ), అవును.. నిజమే. కెరీర్‌ గురించి నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అంటుంటారు. ఆవిడ నా కెరీర్‌లో రెండే రెండుసార్లు సలహా ఇచ్చారంటూ అసలు విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే అందులో ఓ విషయం చెప్పీ చెప్పనట్టుగా చెప్పేశాడు.

నటుడిగా ఒక సినిమా చేయొద్దు అని అమ్మ చెప్పిందట. కానీ ఆ మాట వినలేదట. అయితే అది ఏ సినిమా అనేది చెప్పొచ్చు కానీ, ఆ దర్శకుడు ఇప్పుడు లేరు. ఆయనపై గౌరవంతో చెప్పడం లేదంటూ తప్పించుకున్నాడు. ఇంకోసారి దర్శకుడిగా ‘ఆల్‌ ది బెస్ట్‌’ అనే సినిమా చేయొద్దని చెప్పారు. కానీ నేను వినలేదంటూ అమ్మ మాటను జవదాటిన సందర్భాలను జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ ఆ సినిమా ఏంటని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.