“ఆడు మగాడ్రా బుజ్జీ … ” జగపతి బాబు ఎవరిని అన్నాడో తెలుసా ?

జగపతి బాబు విలక్షణమైన నటుడు , ఎవరినీ పొగడడు , కాక అంతకన్నా పట్టదు . గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు . అల్లాగే పెరిగాడు . హీరో అయిన తరువాత కూడా ఎప్పుడూ అహం ప్రదర్శించలేదు . డిగ్నిఫైడ్ గా ఉండేవాడు . అలాంటి జగపతి బాబు జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు . అరవింద సమేత చిత్రం విడుదల ముందు కార్యక్రమంలో ఎన్టీఆర్ ను ప్రశంసల జల్లులో తడిపాడు .

ఒకానొక సన్నివేశంలో ఎన్టీఆర్ తో తనకు ఫైట్ సన్నివేశం ఉందట . ఈ సినిమాలో తాను మొదట పాల్గొన్న సీన్ అదేనట . అయితే ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్ విప్పాడట. కండలు తిరిగిన ఆ బాడీ చూసి జగపతి బాబు థ్రిల్ అయ్యాడట. . ఆ రోజున తన మనసులో “ఈడు నిజంగా మగాడ్రా బుజ్జీ ” అనుకున్నాడట .

అదే మాటను జగపతి బాబు సభలో చెప్పి ఎన్టీఆర్ అభిమానులను అలరించాడు . ఈ మాట జగపతి బాబు చెబుతున్నప్పుడు అందరు కేరింతలు కొడుతుంటే ఎన్టీఆర్ మాత్రం విషాదంగా కనిపించాడు . ఆయన ఆలోచనల్లో తండ్రి హరికృష్ణ మెదులుతున్నాడు . ఎన్టీఆర్ చాలాఉద్వేగంగా కనిపించాడు . అన్నట్టు ఈ సినిమాలో జగపతి బాబు వుండాలని ఎన్టీఆరే రికమండ్ చేసాడని జగపతి బాబు చెప్పాడు . అంతే కాదు షూటింగ్ సమయంలో అంత పెద్ద హీరో అయిన ఎన్టీఆర్ గొడుగు పట్టుకొని ఒక్కడే వస్తాడని, ఆ సింపుల్ సిటీ బాగా నచ్చిందని జగపతి బాబు చెప్పాడు .