ఆర్జీవీ ల‌వ్‌లో త్రికోణ సొంపుల బికినీ సుంద‌రి

Mia Malkova RGV Climax

ఆర్జీవీ మ‌రోసారి లవ్‌లో ప‌డ్డాడా?

ఆర్జీవీ ఏం చేసినా సంచ‌ల‌నమే. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` అంటూ వివాదాల‌తో బోలెడంత ర‌చ్చ చేశాడు. ఆ సినిమా రిలీజ్‌కి అడ్డుప‌డిన చంద్ర‌బాబు అండ్ కోకి చుక్క‌లు చూపించాడు. ఒక్క‌డే అయినా మొండివాడిగా ఎదురెళ్లి అభిమానుల మ‌న‌సు దోచాడు. ప్ర‌తిసారీ ఇలా ఏదో ఒక సెన్సేష‌న్ చేయ‌డం ద్వారా త‌న సినిమాల‌కు ఉచిత ప్ర‌చారం చేసుకుంటున్నాడు. ఈసారి కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అంటూ కులాల్ని ట‌చ్ చేస్తున్నాడు. ఇలా అగ్ర కులాల్ని రెచ్చ‌గొట్ట‌డం ద్వారా ఏదో ఒక ర‌కంగా ఫ్రీప‌బ్లిసిటీ స్టంట్ అద‌ర‌గొట్టాల‌న్న‌ది ప్లాన్. ప్ర‌స్తుతం ఈ సినిమాకి కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ చేస్తున్నాడు.

ఈలోగానే అత‌డు సామాజిక మాధ్య‌మాల్లో త‌న పాత ఫ్రెండుని ప‌ల‌క‌రించాడు. ఇంత‌కీ ఎవ‌రా పాత ఫ్రెండు? అంటే .. ఇంకెవ‌రు ప్ర‌ఖ్యాత శృంగార క‌థానాయిక మియా మ‌ల్కోవాతో ట‌చ్ లోకి వెళ్లాడు. శాండియాగో బీచ్‌ల బికినీ విలాపంలో మునిగి తేలుతున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మియా మ‌ల్కోవా.. దీనికి క్యాప్ష‌న్ ఇచ్చి రీట్వీట్ చేయండి అని కోరింది. ఇంకేం ఉంది. ఆర్జీవీ వెంట‌నే దానికి ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ఇచ్చి రీట్వీట్ చేశాడు. `ఇది దీర్ఘచతురస్రాకార త్రికోణ సొంపుల సుంద‌రి ప్రేమ‌` అంటూ అద్భుత‌మైన క్యాప్ష‌న్ ఇచ్చాడు. మియా మ‌ల్కోవా న‌టించిన జీఎస్‌టీ యూట్యూబ్ లో ఎంత పాపుల‌రైందో తెలిసిందే. ఆ సినిమాతోనే మియాతో వ‌ర్మ అనుబంధం పెరిగింది. ఇప్ప‌టికీ అది ఇలా సామాజిక మాధ్య‌మాల్లో కొన‌సాగుతూనే ఉంది. వ‌ర్మ ట్వీట్ల‌కు ప్ర‌తిస్పందించిన ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజులో చెడుగుడు ఆడేస్తున్నారు.