ప్రభాస్ దరిదాపుల్లోకి కూడా ఆ హీరోయిన్ ని రానివ్వకు… వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్?

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత నటించిన సాహో రాదే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు రెండు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచాయి.సాహో సినిమా నార్త్ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ సౌత్ లో మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాదే శ్యామ్.ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే పై ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే నటించడం వల్ల ఈ సినిమా డిజాస్టర్ అయిందని అభిమానులు తనని భారీగా ట్రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, షూటింగ్ కి ఆలస్యంగా రావడం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ప్రభాస్ తో కలిసి సరిగా నటించకపోవడం వంటివి చేస్తూ తనని ఇబ్బంది పెట్టారని దీంతో ఇద్దరు మధ్య గొడవలు కూడా తలెత్తాయని వార్తలు అప్పట్లో వినిపించాయి. ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఇద్దరు మాట్లాడలేదని అయితే మేకర్స్ కల్పించుకొని ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా పూజా హెగ్డే ఏకంగా ప్రభాస్ తోనే గొడవకు దిగడంతో ప్రభాస్ అభిమానులు తనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంకొకసారి మీ దరిదాపులలోకి కూడా ఆ హీరోయిన్ ను రానివ్వకు డార్లింగ్ అంటూ కామెంట్లు చేస్తూ ప్రభాస్ కు ప్రేమతో వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి చేసినటువంటి ఈ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక గత ఏడాది పూజా హెగ్డే ప్రభాస్ సినిమా మాత్రమే కాకుండా ఈమె నటించిన నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో తనని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.