మంచు ల‌క్ష్మీ మెచ్చిన మీమ్.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక మీమ్స్ తో అనేక ఫ‌న్నీ జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంతో క్రియేట్ చేసే మీమ్స్ సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే కాక, ఫుల్ వైర‌ల్ అవుతూ ఉంటుంది. ఇక ప‌లు సంద‌ర్భాల‌ని బ‌ట్టి హీరో హీరోయిన్స్‌పై కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ వారిపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. మంచు ల‌క్ష్మీ కుటుంబానికి చెందిన మంచు ల‌క్ష్మీపై ఇలాంటి చాలానే వ‌చ్చాయి. కొన్నింటిని ఆమె ఫ‌న్నీగా తీసుకోగా మ‌రి కొన్నింటిపై సీరియ‌స్ అవుతూ ఉంటుంది.

మంచు ల‌క్ష్మీ అమెరికా నుండి తిరిగొచ్చాక అనే టెలివిజ‌న్ షోస్‌తో పాటు సినిమాలు చేసింది. ఇంతులో మంచు ల‌క్ష్మీ స్లాంగ్ కాస్త వైవిధ్యంగా ఉండ‌డంతో పాటు న‌వ్వు తెప్పిస్తుంటాయి. దీంతో అనేక మీమ్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసేవి. తాజాగా మంచు లక్ష్మి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం పిట్ట కథలు వెబ్ సిరీస్ లో నటించగా, ఇందులో స్వ‌రూప‌క్క అనే తెలంగాణ ప్రాంతంకు చెందిన మ‌హిళ‌గా న‌టించింది. ఆమె పాత్ర‌పై ర‌కుల్, స‌మంత వంటి సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపించారు. నెటిజ‌న్స్ కూడా ఆమెను అప్రిషియేట్ చేస్తూ కొన్ని మీమ్స్‌ని షేర్ చేస్తూ వ‌చ్చారు.

అయితే ఓ నెటిజ‌న్ షేర్ చేసిన మీమ్‌కు మంచు ల‌క్ష్మీ మంత్ర ముగ్ధురాలు అయింద‌ట‌. అన్నింటిక‌న్నా ఈ మీమ్ నాకు బాగా నచ్చింది అంటూ త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది . నాకు ఎన్నో మీమ్స్ వ‌స్తుంటాయి. అందులో కొన్ని న‌వ్వు తెప్పిస్తాయి, కొన్ని చిరాకు తెప్పిస్తాయి, మ‌రికొన్ని కోపం కూడా తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు నేను షేర్ చేసిన మీమ్ మాత్రం చాలా న‌చ్చింది. నా తండ్రి మోహన్ బాబు ఎక్స్ ప్రెషన్ తో పోల్చుతూ నా ఎక్స్ ప్రెషన్ ను పోల్చుతూ చేశారు కాబ‌ట్టి ఇంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని పేర్కొంది. రాయల సీమ‌ రామన్న చౌదరి సినిమా లో మోహన్ బాబు పాన్ వేసుకునే సీన్‌ ను మరియు మంచు లక్ష్మి స్వరూపక్క గా పాన్ వేసుకునే సీన్‌ను క‌లిపి చేసిన మీమ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.