Home News ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని సంభ్ర‌మాశ్చర్యాల‌కు గురి చేశాయి. ఛ‌త్ర‌ప‌తి నుండి మొద‌లైన ప్ర‌భాస్ ప్ర‌భంజ‌నం బాహుబ‌లి సినిమాతో రెట్టింపు అయింది. దేశ విదేశాల‌లో ఆయ‌న ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా జ‌పాన్‌లో ప్ర‌భాస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ‌య్యారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకు జ‌పనీస్ కొంద‌రు ఆయ‌న‌ను క‌లిసేందుకు ప్ర‌త్యేకంగా ఇండియాకు వ‌స్తుంటారు.

Prab | Telugu Rajyam

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సాహో చిత్ర కాస్త నిరాశ ప‌ర‌చ‌గా, ఇప్పుడు రాధే శ్యామ్ అనే చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. స‌మ్మ‌ర్ వ‌ర‌కు సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేక‌ర్స్. ఇక ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు స‌లార్, ఆదిపురుష్ మూవీస్ కి సంబంధించిన షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుండి మొద‌లు కానుంది. ఇక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు.

ప్రభాస్ రేంజ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయి రేంజ్‌కు వెళ్ళిన ప్ర‌భాస్ అనేక రికార్డులు సాధిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ప్ర‌భాస్ తాజాగా త‌న ఫాలోవ‌ర్స్ సంఖ్యను 6 మిలియ‌న్స్‌కు పెంచుకున్నాడు. అతి త‌క్కువ టైంలో ఇంతమంది ఫాలోవ‌ర్స్ సంపాదించిన ఇండియన్ హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఆ మధ్య పేస్ బుక్ లోను ఫాస్టెస్ట్ 20 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన హీరోగా రికార్డు సెట్ చేశాడు. అతి త‌క్కువ పోస్ట్‌ల‌తో ప్ర‌భాస్ ఈ రికార్డులు సెట్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. 

- Advertisement -

Related Posts

త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్...

పునర్నవి అందాల విందు.. పిక్స్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే సోషల్ మీడియాలో పది మందికి పనికి వచ్చే విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వ్యాయామం, సౌందర్య చిట్కాలు,...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన…ఆ ఆరుగురు వీరే !

ఏపీ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా...

Shriya Saran Recent Photos

Shriya Saran ,Telugu Most popular Actress Shriya Saran Recent Photos,Actress Tollywood Shriya Saran Recent Photos Shooting spotphotos,Shriya Saran , Shriya Saran Recent Photos,

Latest News