టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో మరోసారి జత కట్టి చేస్తున్న ఒక మాస్ పవర్ ఫుల్ డ్రామా “దసరా”. కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నా ఈ సినిమా నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
మరి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి ఇప్పుడు క్రేజీ సమాచారం బయటకి వచ్చింది. ఈ సినిమాకి ఇప్పుడు ఆల్రెడీ కేవలం థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ముగిశాయట. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం.
ఈ చిత్రం తాలూకా హక్కులు నాని కెరీర్ లోనే రికార్డు ధరకి అమ్ముడు పోయాయట. అయితే ఈ గతంలో నాని నటించిన “అంటే సుందరానికి” చిత్రం మొత్తంగా 31 కోట్లు సుమారు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ దానిని కేవలం థియేట్రికల్ బిజినెస్ తో దసరా తో బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.
మొత్తం అన్ని హక్కలు కలిపి అయితే ఈ సినిమాకి గాను 50 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ కబాలి, ఫేమ్ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.