తెలుగు ఇండస్ట్రీ హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా కోసం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారీ స్థాయిలో వసూళ్లు తో మహేష్ అదిరే సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను ఇష్టపడే మహేష్ ఇప్పుడు వాటికి బ్రేక్ ఇచ్చి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముచ్చటగా మూడో సినిమాకి ఓకే చెప్పాడు.
అయితే ఇప్పుడు ఈ సినిమాపై నిన్ననే ఒక భారీ అనౌన్సమెంట్ రిలీజ్ డేట్ పై రాగా ఈ సినిమాకి సంబంధించి మరింత ఆసక్తికర సమాచారం సినీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాని మొదటి నుంచి కూడా చాలా లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.
ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ సినిమాకి కళ్ళు చెదిరే బడ్జెట్ ని హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు పెడుతున్నారట. ఇంతకీ ఈ సినిమా టోటల్ బడ్జెట్ ఎంతంటే.. అక్షరాలా 200 కోట్లు అట. ఇదే ఇప్పటివరకు త్రివిక్రమ్ కెరీర్ లో కానీ మహేష్ కెరీర్ లో గాని అలాగే నిర్మాతల కెరీర్ లో కానీ అత్యధికం.
దీనితో ఈ సినిమాపై ఈ టాక్ మంచి వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాని కంప్లీట్ గా భారీ ఏక్షన్ థ్రిల్లర్ గా మధ్యలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అవ్వగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.