షాక్ ఇచ్చింది?: ఇలియానా ఏంటి ఇలా ఉంది..అదీ ఆ ప్లేస్ లో

ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక వెబ్ మీడియాలో కూడా ఒకే వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే…ఇలియానా ఏంటి చిత్రంగా అంత లావుగా ఉంది…అదీ ఆమె ఓ కూరగాయలు షాప్ వద్ద ..బేరం చేస్తూ కనపడింది ఏమిటీ అని…కొంతమందైతే ఆమె ఇలియానా కాదు..ఇలియానా లాంటి మరొక ఆమె అంటూ కంక్లూజన్ కూడా ఇచ్చేసే ప్రయత్నం చేసారు.

వివరాల్లోకి వెళితే…గోవా బ్యూటీ ఇలియానా చాలా గమ్మత్తుగా ఈ మధ్యన ముంబైలోని బాంద్రా ఏరియాలో రోడ్డు ప్రక్కన ఉన్న కూరగాయల కొట్టుకు వెళ్లి అందరిలాగానే కూరగాయలు కొనుక్కుంది. కూరగాయలు ఏరి చక్కగా ఓ మధ్యతరగతి మహిళలా బేరం ఆడి మరీ కొందిట. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో ఆమెదే.

సర్లేండి..దాంట్లో అంత వింతేముంది అంటారా..ఇలియానాని ఇలా చూస్తే మాత్రం ఎవరైనా షాక్ తింటారు అనేలా తయారైంది.  ఈ గోవా భామ బాగా కండ పట్టేసి..   బొద్దుగా తయారైపోయింది. ఓ రోడ్ సైడ్ షాప్ లో కూరగాయలు కొంటున్న బొద్దు ఇలియానాను ఫోటోల్లో, వీడియోలో కొందరు  బంధించేశారు.

ముఖం తో సహా మొత్తం లావుగా మారిపోయిన ఇలియానాను చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు.  మరి ఇలా అయితే  ఈ  లుక్స్ తో  జనాలను ఎలా ఆకట్టుకుంటుందనేది పెద్ద సమస్య.

ఇక ఆమె అభిమానులకు ..హఠాత్తుగా ఇలియానా షేపులు ఛేంజ్ అవటానికి గల కారణం ఏంటనే విషయం అంతు బట్టడం లేదు.  దానికి తోడు అప్పుడప్పుడు తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ లవర్ తీసే ఫోటోలను షేర్ చేస్తున్న ఇలియానా.. వాటిని నెట్ లో షేర్ చేస్తూనే ఉంది. వాటిలో సన్నగానే కనిపిస్తున్న ఈ బ్యూటీ..బయిట  ఇంత లావుగా ఎప్పుడు మారిపోయిందనేది ఓ అంతు చిక్కని ప్రశ్నే.