ఒకప్పటి సినీ రంగ ప్రముఖులు నెమ్మదిగా వారి సినీ వారసులను సినిమాలకు పరిచయం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న తారల్లో చాలా మంది స్టార్స్ కుటుంబాల నుండి వచ్చిన వారే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్నీ సినిమా ఇండస్ట్రీస్‌లో వారసులున్నారు. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ గౌతమి తనయ వీరి కోవలోకి గౌతమి చేరుతుందా? అంటే కొన్ని రోజుల క్రితం మీడియా వర్గాల్లో గౌతమి తనయ సుబ్బలక్ష్మి ఎంట్రీ గురించి పలు వార్తలు వినిపించాయి. సుబ్బలక్ష్మి తల్లి బాటలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై గౌతమి ఓ సందర్భంలో స్పందించారు. `సుబ్బలక్ష్మి దర్శకత్వానికి సంబంధించిన శిక్షణను తీసుకుంటుంది. తను హీరోయిన్ కావాలనుకుంటున్నానని నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ తను హీరోయిన్ కావాలనుకుంటే మాత్రం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా జీవితంలో జరిగిన ప్రతి విషయం తనకు తెలుసు. తన దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేదు
కూతురు సినీ ఎంట్రీ గురించి గౌతమి
