‘ఆర్ఆర్ఆర్’సెట్ నుంచి ఫస్ట్ ఫొటో వచ్చేసింది

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోగా రూపొందిస్తున్న తాజా చిత్రం ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టీమ్ ..ఆర్.ఆర్.ఆర్ సెట్ నుంచి ఓ ఫొటోని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు. ఎన్టీఆర్,రాజమౌళి, రామ్ చరణ్ లు కూర్చుని ఫొటోకు ఫోజ్ ఇచ్చారు.

ఇక ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో ఈ షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ‘బాహుబలి’ చిత్రం తో దేశ వ్యాప్తంగా గుర్తింపు ను తెచ్చుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తూండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నాను.నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి అంచనాలను మించేలా నిర్మాణంలో ఎక్కడా రాజీపడబోము.

సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.