వైరల్ : ఫైనల్ గా తన లుక్స్ రివీల్ చేసిన కాజల్..మళ్ళీ రెడీ అంటుందా?

Surprise element in Acharya

సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్స్ లో గ్లామరస్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అయితే దాదాపు ఒక దశాబ్దంన్నర అలా సినిమాల్లో భారీ క్రేజ్ సంపాదించుకుని ఫైనల్ గా గత 2021 లో పెళ్లి చేసుకుంది.

అయితే దీనితో కాజల్ కెరీర్ అయిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ అప్పటికే ఓకే చేసిన కొన్ని సినిమాలు ఉండడంతో వాటిని మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ఇక దీనితో పాటుగా అప్పట్లోనే మెగాస్టార్ తో “ఆచార్య” సినిమా చేసింది. తర్వాత పెళ్లయ్యాక తన శరీరం లో కూడా చాలానే మార్పులు వచ్చాయి.

దీనితో  కామెంట్స్ కూడా రాగా కాజల్ వాటిపై స్పందించింది. ఇక తర్వాత ఎలాగో తనకి కొడుకు కూడా పుట్టాక ఇప్పుడు తన ఫిట్నెస్ పై మళ్ళీ ద్రుష్టి పెట్టింది. దీనితో ఇప్పుడు మళ్ళీ నాజూకైన లుక్ లోకి మారిపోయి తన కొత్త ఫోటోలు రిలీజ్ చేసింది. వీటిలో ముందు మీద కాస్త సన్నగానే కనిపిస్తూ మళ్ళీ సినిమాల కోసం రెడీ అయినట్టే కనిపిస్తుంది.

దీనితో కాజల్ షేర్ చేసిన ఈ కొత్త ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం అయితే ఈమె దర్శకుడు శంకర్ మరియు ఉలగనయగన్ కమల్ హాసన్ ల భారీ సినిమా “ఇండియన్ 2” లో నటించనుంది. బహుశా ఈ సినిమా కోసమే అప్పుడు ఉన్న లుక్ లోకి మళ్ళీ మారిందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే కాజల్ ఈజ్ బ్యాక్..