నాగార్జున, నానిల ‘దేవదాస్’ చిత్రం వారం క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ చిత్రం కావడంతో తొలిరోజు వసూళ్లు బాగున్నాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపింది. అయితే ఆ స్దాయిని ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయింది. వీకెండ్ ముగియగానే కలెక్షన్స్ చల్లబడ్డాయి. సిటీల్లో బాగున్నా..బి,సి సెంటర్లలలో కాలెరెత్తుకునే పరిస్దితి లేదు.
మొదటవారం పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ 21 కోట్లు వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ప్రీ
రిలీజ్ బిజినెస్ 38 కోట్లు వరకూ జరిగిందని తెలిస్తోంది. దాంతో కలెక్షన్స్ డ్రాప్ అవటంతో పూర్తి రికవరీ ఉంటుందా లేదా అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది.
రికవరీ ఉంటే యావరేజ్ లో పడిపోయినట్లే. ఈ వారం ఈ సినిమాకు కీలకంగా మారింది. అటు విజయదేవరకొండ కూడా నోటాతో ఈ వారమే వస్తూండటంతో ఏ మేరకు ఈ సినిమా షేర్ తీసుకువస్తుంది అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చనియాంశంగా మారింది. అలాగే వచ్చే వారంలో ‘అరవింద సమేత..’ రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవదాస్’పరిస్దితి ఏమిటనేది వేచి చూడాల్సిన అంశమే. రికవరీ లేకపోవేతే ఫ్లాఫ్ క్రిందే పరిగణించాల్సి ఉంటుంది.