Home Tollywood చిరు చెవిన పడినట్లుంది...ఖండిస్తూ ప్రకటన

చిరు చెవిన పడినట్లుంది…ఖండిస్తూ ప్రకటన

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత చిరంజీవి… ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. క్రితం సంవత్సరం నవంబర్, డిసెంబర్ లలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారనే వార్తలు కూడా వినిపించాయి.

అయితే త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుంచీ.. కొరటాల శివతో మూవీ ఉండటంలేదని, అది ఇంకా లేటు కానుందని ఏవేవో రూమర్స్‌ మొదలయ్యాయి. అయితే ఇవన్నీ చిరంజీవి, కొరటాల చెవిన పడినట్లున్నాయి. వీటన్నంటిపై కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అఫీషియల్ గా ఓ ప్రకటనను విడుదల చేశాయి.

ఈ రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం.. సైరా పూర్తైన వెంటనే ప్రారంభం కానుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఈ చిత్తరం ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారని ఈ మూవీపై వస్తోన్న రూమర్స్‌కు చెక్‌ పెట్టేసి మెగాభిమానులకు ఆనందం కలగచేసారు. కొరటాలతో మూవీ అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు దీన్ని బట్టి అర్దమవుతోంది.

మరో ప్రక్క ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో నటించిన తమన్నా చిరుతో పూర్తిస్థాయి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందన్న మాట. ‘రచ్చ’ సినిమా రిలీజ్‌ సమయంలో.. తమన్నాతో కలిసి నటించాలని ఉందని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్నా ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

‘వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ .. పిక్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ అభిమానుల్లో లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని...

ఇంట్రెస్టింగ్ పాయింట్.. మొగలి రేకులు సాగర్ రచ్చ!

మొగలిరేకులు సీరియల్ చూడని, ఆ పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు.బుల్లితెరపై మొగలిరేకులు ఓ సంచలనం. అందులోని అన్ని పాత్రలూ ఓ ముద్రను వేశాయి. మరీ ముఖ్యంగా ఆర్కే నాయుడి పాత్రలో సాగర్...

ఆ సినిమా చేయొద్దన్నా వినలేదు.. జేడీ చక్రవర్తి కామెంట్స్

జేడీ చక్రవర్తి సినిమాలు, ఆయన ఎంచుకునే పాత్రలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి జేడీ చక్రవర్తి తాజాగా మీడియాతో ముచ్చటించాడు....

Latest News