షాక్ :చిరుకి కానీ,‘మెగా’ఫ్యామిలీకి సంబంధం లేదు

మెగాస్టార్‌ చిరంజీవి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి వచ్చారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం పట్టణంలో ఆయన ఓ పాఠశాలను ప్రారంభించారని సోషల్ మీడియాలోహంగామా జరుగుతోంది. మెగాభిమానులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇక ఈ స్కూల్ కు రామ్‌ చరణ్‌ అధ్యక్షుడిగా, నాగబాబు ఛైర్మన్‌గా, చిరంజీవి గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారని చెప్పుకొచ్చారు. కాగా దీనిపై శ్రీకాకుళంలోని ‘చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ సంస్థ స్పందించింది. పాఠశాలకు, చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘చిరంజీవి ఇంటర్‌నేషనల్‌ స్కూల్ పేరిట స్థాపించిన సంస్థకు చిరంజీవి, రాంచరణ్‌, నాగబాబుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మెగా కుటుంబం మీద ఉన్న అభిమనాంతో చిరంజీవి,రాంచరణ్‌, నాగబాబుని గౌరవ పౌండర్‌, గౌరవ అధ్యక్షులు, గౌరవ చైర్మన్‌గా మంచి ఉద్దేశంతో మేం నియమించుకునన్నాం.

దయ ఉంచి మెగా స్నేహితులందరు ఈ చిరంజీవి ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ సంస్థకు చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు. అదేవిధంగా మా చిరు (సంస్థ) ప్రయత్నాన్ని ముందుకు నడిపించి పేద ప్రజలకు విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి మీరు కూడా సహకరిస్తారని కొండంత అభిమానంతో’ అని సీఈవో శ్రీనివాసరావు తెలిపారు.