Home Tollywood చరణ్‌ తనతో పాటు నన్ను కూడా ఇరికించాడు: చిరు

చరణ్‌ తనతో పాటు నన్ను కూడా ఇరికించాడు: చిరు

“త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నేను హీరోగా దానయ్యగారు ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసింది రామ్‌చరణ్‌. దానయ్యగారితో చరణ్‌ వరుసగా రెండు సినిమాలు చేయడంతో పాటు నన్ను కూడా ఇరికించారు . త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా ఆకాంక్ష. మా కాంబినేషన్‌లో ఓ చక్కటి సినిమా వస్తుంది.. అది ఎప్పుడొస్తుందా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు చిరంజీవి.

రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం చిరంజీవి రివీల్ చేసారు. తమ్ముడికి ఆప్తుడు అంటూ ఆయన త్రివిక్రమ్ వైపు చూస్తూ చెప్పాలో చెప్పకూడదో తెలియదు గానీ చెప్పకుండా ఉండలేకపోతున్నానని అన్నారు.

ప్రస్తుతం చిరంజీవి..సురేంద్రరెడ్డి డైరక్షన్ లో సైరా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమా చిరంజీవికి 153వది అవుతుంది. ఇవన్నీ చూస్తూంటే చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని, సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

- Advertisement -

Related Posts

పైన ప‌టారం లోన లొటారం .. అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ !

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు...

బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ‌కు ప‌వ‌న్ కళ్యాణ్ లేఖ‌ !

గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ సినిమాల‌కు దూరంగా ఉన్న అయన క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అభిమానుల సంగ‌తి అటుంచితే సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ అంటే ప‌డిచ‌చ్చిపోతున్నారు. ఆయ‌న నుండి ఏదైన...

రేయ్ ఇక ‘అల్లరి’ పేరు మార్చేయ్ .. నాని సలహా !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత 8 ఏళ్ళలో విజయం లేకుండా ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. సుడిగాడుతో వచ్చిన...

Latest News