బిగ్ ప్లాన్ : 2023 ఫస్ట్ క్వార్టర్ లోనే బాలయ్య నుంచి డబుల్ ధమాకా..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకరైన నందమూరి నటసింహ బాలకృష్ణ తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక హిట్ సినిమా తర్వాత మళ్ళీ వరుసగా ఒక ప్రామిసింగ్ లైనప్ ని అయితే సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఎప్పుడో ఇలాంటి లైనప్ ని సొంతం చేసుకున్న బాలయ్య మళ్ళీ మధ్యలో కొన్ని హిట్స్ వచ్చినా ఆ హిట్ పరంపరని మాత్రం మరో సినిమాలతో కొనసాగించలేకపోయాడు.

కానీ ఇప్పుడు ఫైనల్ గా “అఖండ” రిలీజ్ తర్వాత ఓ రేంజ్ లో లైనప్ ని సెట్ చేసుకొని అభిమానులకి అయితే ఎప్పటికప్పుడు పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాలు అయితే బాలయ్య కెరీర్ లో 107 అలాగే 108 సినిమాలుగా చేస్తుండగా 107వ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే బాలయ్య 108వ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ బాలయ్య స్పీడ్ కోసం తెలిసిందే కదా.. దీనితో ఈ సినిమా రిలీజ్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేసేసారట. మరి దీనికి ముందు వచ్చే సినిమా బాలయ్య 107 ని జనవరి నెల సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా..

ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చెయ్యని 108వ సినిమా కూడా 2023 లోనే రిలీజ్ చేస్తున్నారట. ఇంకా ఆశ్చర్యకర అంశం ఏమిటంటే ఈ సినిమాని ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తారట. ఇది మాత్రం షాకింగ్ అని చెప్పాలి.

అంటే 2023 మొదటి నాలుగు నెలల లోపే బాలయ్య నుంచి రెండు సినిమాలు వచ్చేసి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమాలు రెండిటికీ కూడా థమన్ నే సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.