మాసివ్ అప్డేట్ : చిరు “భోళా శంకర్” నుంచి క్రేజీ పోస్టర్ తో రిలీజ్ డేట్ ప్రకటన!

తెలుగు చలన చిత్ర దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమాలు మూడు ఉన్నాయి. సినిమాల్లోకి మళ్ళీ వచ్చి బిజీగా మారిన చిరు మళ్ళీ తన పాత రోజుల్లా ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు షూటింగ్ చేసేస్తున్నారు.

మరి అలా స్టార్ట్ చేసిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న ఏక్షన్ ఫిల్మ్ “భోళా శంకర్” కూడా ఒకటి. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ చిరు కి చెల్లెలిగా నటిస్తుంది.

మరి ఈ సినిమా నుంచి అయితే చిత్ర యూనిట్ నుంచి ఇప్పుడు ఒక మాసివ్ అప్డేట్ బయటకి వచ్చింది. రేపు ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు బిగ్ అప్డేట్ ని అయితే అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023లో ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా చిరు పై ఒక అల్ట్రా స్టైలిష్ పోస్టర్ ని రివీల్ చేసి అనౌన్స్ చేసారు.

దీనితో ఈ బిగ్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసింది. ఇక ఈ సినిమాకి అయితే మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.