షూటింగ్ మొదలైంది:’అల్లూరి సీతారామరాజు’ గా బాలకృష్ణ

అప్పట్లో నందమూరి తారక రామారావు కు అల్లూరి సీతారామరాజుగా కనపడాలని కోరిక ఉండేది. అందుకోసం ఆయన ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ లోగా కృష్ణ ఊహించని విధంగా అదే సబ్జెక్టుతో సినిమా చేసి హిట్ కొట్టారు. మొదట కోపగించుకున్నా..కృష్ణ నటన ,అల్లూరి సీతారామరాజుగా కృష్ణ గెటప్ చూసి ఎన్టీఆర్ సైతం ముచ్చటపడి మెచ్చుకున్నారు.

అయితే అది గతం. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ అల్లూరి సీతారామరాజు కథని సినిమా గా చేయాలనుకోలేదు. కానీ ఆయన మనస్సులో ఆ గెటప్ పట్ల ఉన్న ఉత్సాహం పోలేదు. దాంతో మేజర్ చంద్రకాంత్ సినిమాలో అల్లూరి గా కనిపించి తన అభిమానులను మురిపించారు. ఇప్పుడు బాలయ్య సైతం తన తండ్రిలా అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించాలని నిర్ణయించుకున్నారు.

ఎన్టీఆర్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో అల్లూరి సీతారామరాజుగా కొద్దిసేపు కనిపించనున్నారు. ఈ మేరకు షూటింగ్ స్టార్టైంది. ఈ దీపావళికు విడుదల చేసే ఎన్టీఆర్ బయోపిక్ ..పిక్ అల్లూరి గెటప్ లో బాలయ్యదే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక వచ్చే సంక్రాంతికి `ఎన్టీఆర్` బ‌యోపిక్ విడుద‌ల కాబోతోంది. తొలి భాగాన్ని జ‌న‌వ‌రి 9న‌, రెండో భాగాన్ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.