‘అరవింద సమేత వీరరాఘవ’ రికార్డ్ బద్దలు కొట్టింది

‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం ఈ రోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యాన్స్ షోల నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అడ్వాన్స్‌‌ బుకింగ్‌ భారీ స్థాయిలో జరిగింది.  దాంతో మొదటి రోజు కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి.

ఇక  అమెరికాలోనూ ‘వీర రాఘవ’ తన రేంజి ఏంటో చూపుతున్నాడు. అమెరికాలో  మొత్తం 194 ప్రాంతాల్లో రిలీజైన ఈ ఇప్పటికే .. 707,698 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇది ఎన్టీఆర్ కెరీర్ రికార్డ్. ఆయన ఇంతకు ముందు నటించిన ‘జైలవకుశ’ సినిమా కలెక్షన్ రికార్డ్ ను బీట్‌ చేసినట్లు ట్రేడ్ లో అంచనా వేశారు.

‘జైలవకుశ’ అమెరికాలో తొలి రోజు 589,219 డాలర్లు రాబట్టింది. ఇక ‘జనతా గ్యారేజ్‌’ 584,000 డాలర్లు రాబట్టింది. ఈ చిత్రం  707,698 డాలర్ల రాబట్టడంతో… ఎన్టీఆర్ ..కెరీర్‌లో అమెరికాలో ఈ  స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ నమోదు చేసింది. ఇదే స్పీడు కొనసాగితే..అతి కొద్ది రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. ఎన్టీఆర్‌కు జంటగా పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని…. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు.