సామ్ నుంచి కూడా మాసివ్ ట్రీట్.. అందుకు తేదీ, టైం ఖరారు.!

మాజీ అక్కినేని సమంత హీరోయిన్ గా ఇప్పుడు అపీలు భారీ ప్రాజెక్ట్ లు తన చేతిలో పెట్టుకొని రానున్న కొన్నేళ్ల వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా కెరీర్ పరంగా చూసుకుంటూ వెళ్తుంది. అయితే తాను ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలు వెబ్ సిరీస్ లు తో బిజీగా ఉండగా..

ఈ సినిమాల్లో ఇప్పుడు ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా నుంచి చిత్ర యూనిట్ అయితే ఈ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఇప్పుడు సమంత రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఒకటి దర్శకుడు గుణశేఖర్ తో “శాకుంతలం” కాగా మరో చిత్రం దర్శకుడు హరి శంకర్ తో “యశోద”.

ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కాగా ఇప్పుడు యశోద చిత్ర యూనిట్ ఓ బిగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా నుంచి అంత ఎదురు చూస్తున్న ఇంట్రెస్టింగ్ టీజర్ ని అయితే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ టీజర్ అయితే ఈ సెప్టెంబర్ 9న ఫిక్స్ కాగా దీనికి టైం కూడా రీవీల్ చేశారు.

ఆరోజు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి అయితే ఈ టీజర్ విడుదల చేస్తారట. ఇక దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ ని చూస్తే సామ్ మరింత ఆసక్తి పెంచుతుంది. చాలా మంది లేడీస్ లో తాను దెబ్బలతో స్టన్నింగ్ గా కనపడుతుంది. ఇక దీనితో అయితే సమంత అభిమానులు ఈ టీజర్  చూస్తున్నారు.