’24 కిస్సెస్’ టీజర్ కు మంచి స్పందన

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ’24 కిస్సెస్’ సినిమా ఫస్ట్ లుక్ కు , హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది.  ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

 

 

సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. 24 కిస్సెస్ సినిమా అదే కోవలోకి చేరబోతోంది.  కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ ’24 కిస్సెస్’ సినిమాను నిర్మించాయి.

 

నటీనటులు:

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్

 

సాంకేతిక నిపుణులు:

డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి.

నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.

కెమెరామెన్: ఉదయ్ గుర్రాల

మ్యూజిక్: జాయ్ బరువ

ఎడిటర్: ఆలయం అనిల్

రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్.

లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ

కో.డైరెక్టర్: శ్రవణ్ కుమార్

పి. ఆర్.ఓ: వంశీశేఖర్