సంక్రాంతికి వస్తున్న #AA19

అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న బన్నీ 19 వ సినిమా గురించి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది అని నిర్మాతలు ప్రకటించారు. అంటే ఈ సినిమా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తో పోటీ పడనుంది. #AA19 కి ప్రస్తుతం ఇంకా పేరు పెట్టలేదు.

ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ కాగా మరో కీలక పాత్రలో నివేత పెత్తురాజ్ ను అనుకుంటున్నారట.
ఇంతవరకు ఈ సినిమా ఈ ఏడాది దసరాకి విడుదల అవుతుంది అనుకున్నారు కానీ దసరాకి ‘సై రా’ విడుదల ఉండడంతో సంక్రాంతికి మార్చారట.