చిన్న ఆర్టిస్ట్ కు పెద్ద సినిమాలో పెద్ద పాత్ర అది ఎవరంటే…

కళాకారులందరూ ఒకటే అయినా ఒక్కొక్కరి స్థాయి వేరు. అదృష్టం కొద్దీ వారికీ దొరికిన అవకాశాలను వాడుకుని ఎదుగుతూ ఉంటారు. కానీ ఒక చిన్న ఆర్టిస్ట్ ఒక పెద్ద సినిమాలో పెద్ద పాత్ర దొరకడమంటే అది సాధారణ విషయం కాదు. అది వినియోగించుకుని కష్టపడితే, అదృష్టం కలిసి వస్తే మొత్తం కెరీర్ మారిపోతుంది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా – సీరియల్ మరియు సినిమా నటుడు హర్ష వర్ధన్ గురించి.
అతనికి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో పెద్ద పాత్ర దొరికిందట. అసలు ఈ పాత్రకి త్రివిక్రమ్ సినిమాలో ఎప్పుడూ కనిపించే రావు రమేష్ ను అనుకున్నారట. కానీ ఆయన ఈ సినిమా కంటే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాని ఒప్పుకుని దీనిని కాదనుకున్నారు. దాంతో ఆ పాత్రకి ఎవరా అని అనుకుంటుండగా త్రివిక్రమ్ దృష్టిలో హర్ష వర్ధన్ పడ్డాడు. సరే, ఏది ఏమైనా ప్రేక్షకులు ఆదరిస్తే ఇక దశ తిరిగినట్టే.