ఏ విషయం పైనైనా స్పందించారంటే నెటిజన్ల నుండి రియాక్షన్ ఓ రేంజ్లో ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటే గొడవే ఉండదు కాని.. నెటిజన్ల నుండి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తే మాత్రం తట్టుకోవడం కాస్త కష్టమే అన్నట్లు ఉంటాయి. సోషల్ మీడియాలో నిన్న విడుదలైన బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రల్స్ మొదలు పెట్టారు.
ఈ శుక్రవారం రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. కథా కథనాలతో పాటు లుక్ విషయంలోనూ బాలయ్య నిరాశపరచటంతో అభిమానులు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లతో డీలా పడిపోయిన అభిమానులను రూలర్ మరింతగా బాధపెట్టింది.
ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఒక లుక్ హాలీవుడ్ క్యారెక్టర్ ఐరన్ మేన్ తరహాలో ఉండటం కాస్త పరవాలేనిపించినా, పోలీస్ గెటప్ మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఆ గెటప్‌లో బాలకృష్ణ తెరమీద చూడటమే కష్టంగా అనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సినిమాకు బ్యాడ్ టాక్ రావటంతో మరోసారి బాలయ్యకు నిరాశ తప్పేలా లేదు. అలాగే ఈ చిత్రం ఓసీన్లో బాలయ్య కోమాలో ఉండగా వెంటనే కోల్కోని జయసుధను కాపాడడం కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. అలాగే కథలో చాలా సంఘటనలు ఫన్నీగా అనిపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆయన లుక్స్, విగ్స్ మీద అయితే దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారన్న వార్త వార్త వైరల్ అవుతోంది.
బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2019లో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో బాలయ్య తదుపరి చిత్రాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ సినిమాతో దారుణమైన రిజల్ట్‌ను చవిచూశాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడమే కాదు బోయపాటి కెరీర్‌ను కూడా ఇబ్బందుల్లో పడేసింది. దీంతో బాలయ్య సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు చూస్తున్నాడు బోయపాటి.