తమన్నా.. బాలయ్యకు నో చెప్పిందా?!

Tamannah Bhatia

‘టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాలకృష్ణకు నో చెప్పిందా.. ?!’ అవుననే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ! కెరీర్‌ని ఆరంభించిన కొద్దికాలంలోనే అగ్రస్థాయికి దూసుకెళ్లిన హీరోయిన్ తమన్నా. ఆరంభంలో వరుస విజయాలతో కెరీర్‌ని సక్సెస్ బాటలో నడిపించినా, కొద్దికాలం క్రితం ఫ్లాపులతోనూ వెనకపడింది. గత సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్2’ హిట్టుతో మళ్లీ కెరీర్‌ను గాడిలోపెట్టిన తమన్నా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చేసిన పాత్రతో మళ్లీ స్టార్ ఇమేజ్‌ను అందిపుచ్చుకుంది.

అగ్రహీరోబాలకృష్ణ ప్రాజెక్టునుంచీ తమన్నాకు చాన్సొచ్చింది. బాలయ్యతో బోయపాటి తెరకెక్కించనున్నఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్‌కు వెళ్లనుండటం తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టులో వచ్చిన ఆఫర్‌ను తమన్నా సున్నితంగా తిరస్కరించిందట. బాలయ్య ప్రాజెక్టులో చాన్స్‌వస్తే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అయితే, కొద్దికాలంగా ఆయనకు సరైన హిట్లులేక సతమతమవుతున్న నేపథ్యంలో .. బాలయ్యతో జోడీ కడితే తన కెరీర్‌కు ప్రమాదమన్న ఆలోచనలో తమన్నా ఉండటం తిరస్కారానికి కారణమన్న మాట వినిపిస్తోంది!?