‘భోళాశంకర్‌’ ఫెయిల్యూర్‌తో మెహెర్‌ రమేష్‌ పై సెటైర్లు!

దర్శకుడు మెహెర్‌ రమేష్‌ కి దాదాపు పదేళ్ల తరువాత ఒక మంచి అవకాశం వచ్చింది.. అదే ఒక సినిమా దర్శకత్వం చేయడానికి. అది కూడా మామూలు సినిమా కాదు, సాక్షాత్తూ మెగాస్టార్‌ కథానాయకుడిగా చేస్తాను అన్నారు. అంటే మెహెర్‌ కి ఇది ఒక గొప్ప అవకాశం. కథ కూడా వెతుక్కో అక్కరలేకుండా తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్‌ చేసుకోమన్నారు. అదే ‘భోళా శంకర్‌’ సినిమా.

చిరంజీవి కథానాయకుడు, తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌ ఇందులో చిరంజీవికి చెల్లెలు గా చేసింది. ఇంత పెద్ద బ్జడెట్‌ సినిమా రావటం మెహెర్‌ రమేష్‌ కి జీవితంలో రాని గొప్ప అవకాశం, కానీ వచ్చింది, అయితే.. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సినిమాని ఒక డిజాస్టర్‌ గా చేసాడు మెహెర్‌ రమేష్‌. అతనికి ఒక ఛాన్స్‌ ఇద్దామని చూస్తే, అతను ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు.

మళ్ళీ మెహెర్‌ దర్శకుడిగా కనపడే ఛాన్స్‌ ఉందా? ఇదే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కోవిడ్‌ వచ్చినప్పుడు మెగా స్టార్‌ చిరంజీవి పరిశ్రమలో వున్న కొన్ని వేలమంది సినిమా కార్మికుల కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఒక తన ట్రస్ట్‌ ద్వారా డబ్బులు పోగు చేసి, ఈ సినీ కార్మికుల్ని ఆదుకోవాలని అనుకొని వంట దినుసులు, ఇతర అవసరాలు తీర్చే ముడిసరుకులు కార్మికులకు అందేలా ఏర్పాట్లు చేసారు.

అప్పుడు పరిశ్రమలో అందరూ చాలా సంతోషించారు, ఆ సమయంలో మెగాస్టార్‌ చేసిన సహాయం ఎవ్వరూ మర్చిపోరు, అలాగే ఇంకా చాలా చేసి సినిమా పరిశ్రమని ఎంతగానే ఆదుకున్నారు. అప్పుడు మెగా స్టార్‌ చేసిన ఆ పనిలో మెహెర్‌ రమేష్‌ కీలక పాత్ర పోషించాడు.

మెహెర్‌ రమేష్‌ కార్మికులకు మెగా స్టార్‌ ఇచ్చిన సహాయ సహకారాలు అన్నీ సరిగా అందరికీ అందేలా చాలా పాటుపడ్డాడు. ఆ సమయంలో ఎవరూ అంతగా బయట తిరగడానికి కూడా ఇష్టపడని సమయంలో మెహెర్‌ రమేష్‌ తాను ఒక్కోసారి బైక్‌ మీద కూడా వెళ్లి ఆ దినుసులు, సరకులు కార్మికులకు అందేటట్టుగా చూసేవాడు.

చాలా చేసాడు అప్పుడు మెహెర్‌ రమేష్‌, అందుకు గాను చిరంజీవి గారు అతనికి సరే నాతో ఒక సినిమా చేసుకో, నువ్వు ఇంత సహాయం చేసావ్‌ కదా అని ప్రత్యుపకారం చేశారు. మెహెర్‌ రమేష్‌, చిరంజీవి గారికి చెయ్యలేదు, కార్మికులకు చేసాడు. అయినా చిరంజీవి గారు అతని పనికి మెచ్చుకొని ఈ ’భోళా శంకర్‌’ అనే సినిమా ఇచ్చి అతనికి ప్రత్యుపకారం చెయ్యాలని అనుకొని ఇచ్చారు. అప్పటికి పదేళ్లు అయింది మెహెర్‌ రమేష్‌ సినిమా తీసి, ఎవరూ అతనికి దర్శకుడిగా ఛాన్స్‌ అయితే మాత్రం ఇవ్వరు. కానీ చిరంజీవి అంతటి వ్యక్తి ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చెయ్యాలి సినిమా.

కానీ మెహెర్‌ రమేష్‌ చేసింది ఏమిటి, ’జబర్దస్త్‌’ స్కిట్‌ లా సినిమా చుట్టేశాడు. 2023లో చేయాల్సిన సినిమాని 1980లో చెయ్యాల్సిన సినిమాగా చేసాడు. ఒక డిజాస్టర్‌ తీసాడు, మెగా స్టార్‌ కి ఒక డిజాస్టర్‌ ఇచ్చాడు. ఇప్పుడు పరిశ్రమలో ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ’మెహరన్న ఎక్కడున్నాడు’, ఎక్కడ మెహరన్న అని. ఎందుకంటే సినిమా విడుదలకి ముందు చాలా ప్రచార ఆర్భాటాల్లో కనిపించిన మెహెర్‌ రమేష్‌, మార్నింగ్‌ షో సినిమా విడుదలయ్యాక దాని ఫలితం కూడా తెలిసిపోయింది, అంతే మరి ఆ తరువాత కనపడలేదు. అందుకే పరిశ్రమలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ‘మెహరన్న ఎక్కడ’అని!!?