భారీ కలెక్షన్లు రాబడుతున్న జైలర్‌… 7నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్‌!!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం జైలర్‌ . తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.

ఇక తమిళంలో ఈ మార్క్‌ అందుకున్న రెండో సినిమాగా జైలర్‌ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.నీ ఉంది. రోబో సీక్వెల్‌ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్‌ 18రోజుల్లో సాధించింది. అయితే ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీ లాక్‌ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ ఎª`లాట్‌ఫామ్‌ ’అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో సెప్టెంబర్‌ 7 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్టీమ్రింగ్‌ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియాలో వెల్లడిరచారు.