ఇలియానాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల కూతురు

Ileana Dcruz

ఇలియానాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల కూతురు

కొంత గ్యాప్ తర్వాత రవితేజతో కలిసి ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది ఇలియానా. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇలియానా వెళ్లిపోయింది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల ఒక ట్వీట్ పెట్టారు. నీతో కలిసి పని చేయటం చాలా అద్భుతంగా ఉంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కోసం అమెరికాలో కలుద్దాం అని ట్వీట్ చేసాడు.

ఇలియానా కూడా ఒక ట్వీట్ పెట్టింది. మీతో కలిసి పని చేయటం చాలా బాగుంది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీముకి నా కృతజ్ఞతలు. రూప వైట్ల ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ నాకు ఎంతో స్పెషల్. మీ అందరిని కలవటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ఫొటోస్ కూడా జత చేసి పెట్టింది.