కత్తి పట్టిన కార్తికేయ – గుణ 369 ట్రైలర్

Rx – 100 ఎరోటిక్ హీరో కార్తికేయ హై పవర్ యాక్షన్ హీరోగా అవతారమెత్తి వచ్చేస్తున్నాడు. గత మూవీ హిప్పీలో రోమాంటిక్ హీరోగా నటించి ఫ్లాపయిన తను, ఇప్పుడు గుణ 369 లేటెస్ట్ మూవీతో కత్తి పట్టి మాస్ అవతారంతో ప్రేక్షకుల  ముందు కొస్తున్నాడు. దీని ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ట్రైలర్ లో విషయం చెప్పకుండా కేవలం రోమాన్సుతో, ఫైట్స్ తో, కామెడీతో భర్తీ చేశారు. విలన్ ఆదిత్యా మీనన్ తో ఒక యాక్షన్ బిట్, హీరోయిన్ అనఘాతో ఒక లవ్ సీను, మహేష్ అచంటతో ఒక కామెడీ బిట్ రిపీటవుతూ పోయాయి ట్రైలర్ లో – పూరీ జగన్నాథ్ టెంప్లెట్ సినిమాలా.

రొటీన్ లవ్ యాక్షన్ మూవీలా వున్న ఈ ట్రైలర్ లో మెసేజి పరమైన డైలాగులున్నాయి : మనిషి రూపం వేరు, నిజ స్వరూపం వేరు; గొడవ పడితే మిగిలేదేం వుండదు, గొడవ తప్ప…అంటూ. కథ గురించి ట్రైలర్ లో ఎక్కడా హింట్ ఇవ్వలేదు. ఏమాశించి ప్రేక్షకులు ఈ సినిమా కెళ్లాలో చిన్న క్లూ ఇస్తే బావుండేది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని థియేటర్లకి పరుగులు పెట్టించే అడ్వర్టైజ్ మెంట్ లా వుండాల్సింది. చెదురు మదురు రోమాన్స్ – కామెడీ – ఫైట్స్ బిట్స్ తో పాటు పాయింటు కూడా చేర్చి వుండాల్సింది.

ఇందులో అనఘా అనే కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. సీనియర్ నటి మంజూ భార్గవి ఒక పాత్రలో కన్పిస్తోంది. రఫ్ విలన్ గా ఆదిత్యా మీనన్. బోయపాటి శ్రీను శిష్యుడు, కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ ఫార్ములా  యాక్షన్ మూవీని రూపొందించాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమా ఆగస్టు 2 న విడుదలవుతుంది.

Guna369 Theatrical Trailer || Karthikeya, Anagha || Arjun Jandyala || Chaitan Bharadwaj