కేటీఆర్ ను సీఎం చేస్తే ప్రభుత్వం కూలుతుంది ?

మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి ని చేస్తే, మిగతా మంత్రులెవరూ సహకరించరాని, తప్పకుండా ప్రభుత్వం కూలుతుందనే న్యూస్ ఇప్పుడు తెలంగాణాలో వైరల్ గా మారింది. మున్సిపాలిటి మంత్రిగా ఏంతో పాపులారిటీ సంపాదించిన కేటీఆర్ నుముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో అటు కేసీఆర్ కూడా ఉన్నారు. కేటీఆర్ కు రాష్ట్రం అప్పగించి .. తానూ ఢిల్లీ లో రాజకీయాలు చేయాలన్న ప్రయత్నాలు చేసాడు కేసీఆర్ కానీ అవి బెడిసి కొట్టడంతో కొన్నాళ్ళు ఆ ప్రయత్నాన్ని ఆపేసాడు .. తాజాగా మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధించడంతో కేసీఆర్ కు మళ్ళీ పాత ఆలోచనలు కలిగాయి.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే సందర్భం కోసం అటు కేసీఆర్ కూడా ఎదురు చూస్తుండగా .. అయన గట్టి షాక్ తగిలింది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ విడిపోతుందంటూ ఇంటిలిజెంట్ వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అందుకే కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని అన్నారాయన. శుక్రవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగం తరువాత ఢిల్లీ లోని విజయ్ చౌక్ లో ధర్మపురి అరవింద్ తో కలిసి మీడియాతో మాట్లాడారు అయన. ఎంతసేపు కొడుకు సీఎం, తండ్రి పీఎం అన్న తపనే తప్ప , రాష్టాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆలోచన కేసీఆర్ కు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి మతం కోణంతో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ద్ర మోడీ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు. అమలు చేయని పధకాలను అమలులో ఉన్నట్టు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.