వీళ్లు సూపరబ్బా.. పట్టాలపై పడుకున్న వ్యక్తిని ఎలా కాపాడారంటే (వీడియో)

అది ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్. ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంది. ఎవరీ పనుల్లో వారున్నారు. అప్పుడే వారి మధ్యలో ఉన్న ఓ  వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు  రైల్వే పట్టాలపై పడుకున్నాడు. అంతే అక్కడున్న వారంతా వెంటనే అతడిని పక్కకు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి 54 ఏళ్ల నరేంద్ర దమాజీ కోటేకర్ గా గుర్తించారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ లో చాలా మంది ఉన్నప్పటికి కొందరు మాత్రం వెంటనే స్పందించి  అతడిని పక్కకు తీసుకెళ్లి ఆ వ్యక్తిని కాపాడారు. మానవత్వం బతికే ఉందని వారు నిరూపించారు. కాపాడిన వారిని అంతా అబినందించారు. రైల్వే పోలీసులు నరేంద్రకు కౌన్సిలింగ్ నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీ టివిలో రికార్డయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తిని కాపాడిన వీడియో కింద ఉంది మీరూ చూడండి.

 

వీడియో కోసం  ఇక్కడ క్లిక్ చేయండి