‘RRR’ హీరోలకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన యూట్యూబ్ సంస్థ.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ ట్రిపుల్ ఆర్(RRR) నుంచి ఇప్పుడు ఒక్కో అదిరే అప్డేట్ బయటకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా లేటెస్ట్ గా సినిమా నుంచి రెండో పాట మాస్ సింగిల్ “నాటు నాటు” రిలీజ్ చేసిన చెయ్యగా దానికి యూట్యూబ్ నుంచి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది.

అయితే ఈ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వేసిన ఆ డాన్స్ మూమెంట్స్ అని చెప్పి తీరాల్సిందే. వీటిపైనే యూట్యూబ్ సంస్థ వాళ్ళు ఓ రేంజ్ ఎలివేషన్ మన హీరోస్ పై ఇచ్చారు. వారిద్దరి స్పీడ్ తమ 0.5 స్పీడ్ లో చూసినా అలాగే అనిపిస్తుంది అని ఇంకా కొంతమంది అయితే వారిద్దరి డాన్స్ ఇంటర్నెట్ కన్నా స్పీడ్ గా ఉంది అంటున్నారు. ఆ మాటకి కూడా మేము ఒప్పుకుంటున్నామని ఓ రేంజ్ ఎలివేషన్ ఈ బిగ్ మూవీ హీరోస్ పై ఇచ్చారు. దీనితో ఈ ట్వీట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.