Visakhapatnam : విశాఖపట్నంపై ‘పచ్చ’ విషం.! మరీ ఇంత పచ్చిగానా.?

Visakhapatnam : ‘అసలెవరైనా విశాఖపట్నంలో ధైర్యంగా ఓ కిరాణా దుకాణంగానీ, పాన్ షాప్ గానీ పెట్టుకునే పరిస్థితి వుందా.? వైసీపీ నాయకుల బెదిరింపులకు విశాఖ వాసులు విలవిల్లాడిపోతున్నారు..’

అంటూ ఓ సీనియర్ జర్నలిస్టు నిన్న టీడీపీ అనుకూల మీడియా ద్వారా విషం చిమ్మేశారు.. తన డిబేట్ సందర్భంగా. గతంలో ఆయన ఓ ఛానల్ అధిపతిగా కూడా పనిచేశాడనుకోండి.. అది వేరే సంగతి.

విశాఖ ప్రశాంత నగరం. అయినాగానీ, అక్కడా అన్ని చోట్లా వున్నట్టే రాజకీయ రౌడీయిజం వుంది. చంద్రబాబు హయాంలోనూ వుంది.. అంతకన్నా ముందూ వుంది.. ఆ తర్వాతా అది కొనసాగుతూనే వుంది.

హైద్రాబాద్ అయినా, దేశంలో మరో ప్రముఖ నగరమైనా, ఇంకెక్కడైనా.. ఇలాంటివి సర్వసాధారణమే.

నిజానికి, చంద్రబాబు హయాంలోనే విశాఖ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయనే వాదన వుంది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. చంద్రబాబు హయాంలో జరిగిన భూ కబ్జాలపై, చంద్రబాబు హయాంలోనే ‘సిట్’ ఏర్పాటయ్యిందిగానీ, ఆ నివేదిక బయటకు రాలేదు.

చిత్రమేంటంటే, వైసీపీ హయాంలో కూడా ఆనాటి ఆ కబ్జా వ్యవహారాలు వెలుగులోకి రాలేదు. ఇది రాజకీయ అవినీతి. అందుకే, ఎవరు అధికారంలో వున్నా పరిస్థితి ఇలాగే వుంటుంది. అంతమాత్రాన, విశాఖలో ఎవరూ ధైర్యంగా బతకడంలేదనో, వ్యాపారాలు చేసుకోవడంలేదనో అంటే ఎలా.?

పైగా, మీడియా ద్వారా ఇలా విషం చిమ్మడం అత్యంత హేయం. వైఎస్ జగన్ పాలన సోకాల్డ్ పచ్చ మీడియాకి నచ్చకపోవచ్చుగాక. ఈ విషయంలో వైసీపీ పాలన మీద విమర్శలు చేస్తే అది రాజకీయ జర్నలిజం అని సరిపెట్టుకోవచ్చు. ఓ నగరం మీద పనిగట్టుకుని విషం చిమ్మితే.. అది వ్యభిచార జర్నలిజం అనాలేమో.!