Megastar Chiranjeevi Words : చిరంజీవి మాటలతో స్టేజ్ పైనే ఏడ్చేసిన ఈ యంగ్ హీరో.!

Megastar Chiranjeevi Words

Megastar Chiranjeevi Words :  ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో సరికొత్త తరానికి తగ్గట్టుగా కొత్త కొత్త యంగ్ హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు. అయితే అందరూ హీరోలుగా రారు కానీ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోలుగా పలు ఆసక్తికర సినిమాలు తమ ఇమేజ్ కి ఏమాత్రం నష్టం కలగకాకుండా చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ఒక నటుడుగా మరియు హీరోగా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్.

అక్కినేని నాగ చైతన్య సినిమా “మజిలీ” తో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ నటుడు ఆ తర్వాత పలు పాత్రలు చేస్తూనే మెల్లగా హీరోగా మారాడు. అలా తాను చేసిన మొదటి సినిమానే “కలర్ ఫోటో”. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం గత లాక్ డౌన్ లో ఓటిటి లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా తాను కూడా చూశానని మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన “మిషన్ ఇంపాజిబుల్” ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం సుహాస్ ని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా మెగాస్టార్ ఆ సినిమా చూడడమే కాకుండా అతడి నటనను కూడా పొగడడంతో ఒక్కసారిగా ఆ స్టేజి పై సుహాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి కంటతడి కూడా పెట్టుకున్నాడు.

దీనితో ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ లో అయితే చిరు చాలా సినిమాలే చూడగా తాను చూసిన బెస్ట్ సినిమాల్లో కలర్ ఫోటో కూడా ఒకటి అని ఆ చిత్ర యూనిట్ అందరికీ సీఒంగ్గ్రట్స్ తెలిపారు.