ఏపీ సీఎం వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మధ్య గతంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే జగన్ గురించి పాజిటివ్ గా చెప్పడానికి పవన్ కానీ పవన్ గురించి పాజిటివ్ గా చెప్పడానికి జగన్ కానీ ఇష్టపడరు. వాస్తవానికి బాలకృష్ణ, జగన్ మధ్య రాజకీయాల విషయంలో విభేదాలున్నా అఖండ సినిమా విషయంలో బాలయ్య జగన్ సహాయం కోరిన విషయం తెలిసిందే. అదే సమయంలో జగన్ బాలయ్య అభిమాని అని పలు పోస్టర్లు వైరల్ అయ్యాయి.
అయితే జగన్ ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా పవన్ కు నచ్చదు. జగన్ ఏ సందర్భం వచ్చినా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయకుండా ఉండరు. జగన్ పవన్ కళ్యాణ్ కు దత్తపుత్రుడు అని బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇతరులతో స్నేహన్ని ఇష్టపడతారే తప్ప శత్రుత్వాన్ని ఇష్టపడరు. అయితే జగన్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవడం కంటే వైసీపీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జగన్ ను శత్రువులా భావించినా వైసీపీ నేతలను మాత్రం శత్రువులుగా భావించకపోవడం గమనార్హం. తాజాగా పవన్ కళ్యాణ్ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సైతం సవాల్ విసరడం గమనార్హం. చేనేత వస్త్రాలను ధరించి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయాలని సవాల్ విసిరారు.
ఈ సవాల్ విషయంలో బాలినేని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్, పవన్ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం వీళ్లిద్దరి కామన్ అభిమానులకు నచ్చడం లేదు. అయితే పవన్, జగన్ కలవడం ఈ జన్మకు జరగదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అనారోగ్యం నుంచి కోలుకున్న పవన్ త్వరలో రాజకీయ కార్యక్రమాల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది.