తన సినిమాలో ఆ హీరోయిన్ ని వొద్దన్న మహేష్ బాబు

సినిమాల్లో హీరోయిన్ సెలక్షన్ దర్శకుడిదే అయినప్పటికీ ఒక్కోసారి స్టార్ హీరో లు కూడా ఈ విషయం లో తలదూరుస్తూ ఉంటారు. పైగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వున్న హీరో అయితే డైరెక్టర్లు కూడా ఏం చెయ్యలేరు. ఇలాంటిదే ఒక సంఘటన గుణశేఖర్ విషయం లో కూడ జరిగింది.

మహేష్ బాబు తో ‘ఒక్కడు’ సినిమా షూటింగ్ మొదలు కాకముందు గుణశేఖర్ సోనాలి బెంద్రే ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడంట. అయితే అప్పటికే ‘మురారి’ సినిమాలో సోనాలితో నటించిన మహేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో సోనాలి వొద్దని మొండి పట్టు పట్టాడంట. అప్పటికే ఆమెతో ఒక సారి నటించాను, ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుందని పట్టు పడితే చేసేది లేక భూమిక ని సెలెక్ట్ చేసాడంట గుణశేఖర్.