కోట్లు విలువ చేసే ఖరీదైన కారును కొనుగోలు చేసిన విశ్వక్.. కారు ధర ఎంతంటే?

విశ్వక్ సేన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.మొన్నటి వరకు ఈయన ఎవరో తెలియక పోయినప్పటికీ ఈయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో ద్వారా ఆయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇకపోతే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా విశ్వక్ కొత్త కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే కారు అంటే సాదాసీదా కారు కాదండోయ్ లగ్జరీ బ్రాండ్ బెంజ్ లో టాప్ ఎండ్ మోడల్ కారును విశ్వక్ కొనుగోలు చేశారు. గతంలో విశ్వక్ సేన్ రేంజ్ రోవర్ కారును కొన్నాడు. తాజాగా బెంజ్ కారు సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ మోడల్‌ అయిన మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 కొన్నాడు. ఇక ఈ కారు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. ఈ కారు ధర 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. ఈయన కొనుగోలు చేసిన ఈ ఖరీదైన కారు గురించి తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇక విశ్వక్ సేన్ ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు అంటే ఆయన ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నారో అర్థమవుతుంది. ఈ క్రమంలోని తన కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ నా డ్రీమ్ కారును సొంతం చేసుకున్నాను. ఇదంతా కేవలం మీ ప్రేమ అభిమానం వల్లే సాధ్యం అయ్యింది అంటూ ఈయన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.