‘అల..’ టీమ్‌ని బాగా వాడేస్తున్న ‘వరుడు’

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కుతోన్న ‘వరుడు కావలెను’ మూవీకి ప్రమోషన్స్ దద్దరిల్లిపోతున్నాయ్. వరుస ఈవెంట్లతో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోందీ సినిమా. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ల సినిమా కాబట్టి, ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.

ఇకపోతే, తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా నుంచి మరో ఈవెంట్ సిద్ధమవుతోంది. ఆ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ముఖ్య అతిథిగా తీసుకొస్తున్నారు. అల్లు అర్జున్ – సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో..’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సో అలా ఆ టీమ్ మొత్తాన్నీ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నారనుకోవాలి.

అంతేకాదు, ‘వరుడు కావలెను’ సినిమాకీ, ‘అల వైకుంఠపురములో..’ కలర్ సెంటిమెంట్ కూడా వర్కువుట్ అయ్యేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కలరింగ్ విషయంలో ‘అల..’ సినిమానే ఫాలో చేసినట్లుంది ‘వరుడు’ టీమ్. టైటిల్ బ్యాక్ గ్రౌండ్‌తో పాటు, కొన్ని పోస్టర్లలోనూ ‘అల..’ కలర్ (ఎల్లో) సెంటిమెంట్ కనిపిస్తోంది. చూడాలి మరి, ఈ ‘కలర్’ సెంటిమెంట్ ‘వరుడు కావలెను’ హిట్ సెంటిమెంట్ అవుతుందేమో.