‘భూమి, ఆకాశం ఎప్పటికీ కలవవు..’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగుకు, ‘భూమి ఉన్నంతసేపూ దాని చుట్టూ ఆకాశం కూడా ఉంటుంది..’ అనేది హీరో డైలాగ్. ఈ డైలాగే సినిమా కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తోంది. ఇవే కాదు, ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా కొత్త డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వరుడు కావలెను’. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెళ్లి చూపులే ఇష్టపడని అమ్మాయిని గాఢంగా లవ్ చేసి, పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి. ఎలా సెట్టవుతుంది ఈ జంట. అది తెలియాలంటే ‘వరుడు కావలెను’ సినిమా చూడాల్సిందే.
కుర్రకారును కట్టి పడేసే అందమైన లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఎమోషనల్ డైలాగులు, కంటికి ఇంపుగా కనిపించే కనువిందైన దృశ్యాలు.. నదియా, మురళీ శర్మవంటి సీనియర్ తారాగణం ఎక్స్‌పీరియన్స్, సప్తగిరి, వెన్నెల కిషోర్ వంటి కమెడియన్ల నవ్వుల కోలాహలం.. ఇలా ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీకి వుండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
మరి, ట్రైలర్‌లో చూపించినట్లుగా అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేయడంలో ‘వరుడు కావలెను’ సినిమా ఆడియన్స్ మనసు దోచుకుంటుందా.? లేదా.? అనేది తెలియాలంటే 29 వరకూ వేచి చూడాల్సిందే.