Trisha: ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న త్రిష.. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో మరీ?

Trisha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న వారిలో నటి త్రిష కృష్ణన్ ఒకరు. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన వారిలో త్రిష ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇండస్ట్రీలో త్రిష పని అయిపోయిందని అందరూ భావిస్తున్న సమయంలో తమిళ సూపర్ హిట్ సినిమా 96 సినిమాలో అవకాశం దక్కించుకొని మరోసారి ఇండస్ట్రీలో నిలబడ్డారు.

ఈ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా విజయ్ సేతుపతి సరసన ఒక సినిమాలలో నటించి తమిళంలో ఇప్పటికీ పలు అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి తెలుగులో మాత్రం ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు.గతంలో త్రిష మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి హీరోల సరసన నటించారు. ఈమె స్టార్ హీరోలకు సరైన జోడీగా ఉంటుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు.

ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే త్రిష ఈ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే తెలుగులో కూడా అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్ కి బదులుగా హీరోయిన్ ను త్రిష అని భావించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఎలాగైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం వచ్చి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే ఈమె మరి కొంత కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెట్టుకు రాగలదు. మరి ఆ ఒక్క అవకాశం వచ్చే ఏడాదిలోనైనా వస్తుందో లేదో వేచి చూడాలి.