“అఖండ”లో ఈ సీన్ కి థియేటర్స్ లో షేక్..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “అఖండ” కోసం అందరికి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పడు సినిమా యూనిట్ ఒకో అప్డేట్ ని రివీల్ చేస్తూ వస్తుండగా సినిమా సంగీత దర్శకుడు థమన్ ఓ క్రేజీ అప్డేట్ ని ఇచ్చాడు.

ఈ సినిమాలో ఓ అదిరే పోస్టర్ బాలయ్య ది పెట్టి ఆ సీన్ కి అయితే థియేటర్స్ షేక్ అయ్యిపోతాయని చెప్తున్నాడు. దానిని బట్టి సినిమాలో ఆ సీక్వెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ అఘోరా గెటప్ లోనే ఉన్న బాలయ్య వెర్షన్ సాంగ్ ని కూడా ఈ 8న రిలీజ్ చెయ్యనున్నారు. దాని కోసం ఇప్పుడు బాలయ్య అభిమానులు చాలా ఎగ్జియింగ్ గా ఎదురు చూస్తున్నారు.